న్యూఢిల్లీ, జూలై 20: ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టుబ్రో (ఎల్ అండ్ టీ) షేర్ల బైబ్యాక్ చేయనుంది. బైబ్యాక్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకునేందుకు వచ్చేవారంలో డైరెక్టర్ల బోర్డు సమావేశమవుతున్నట్టు గురువారం కంపెనీ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. అలాగే ప్రత్యేక డివిడెండ్‌ను కూడా జూలై 25నాటి సమావేశంలో బోర్డు సిఫార్సుచేస్తుందని వెల్లడించింది. డివిడెండ్‌కు ఆగస్టు 2 రికార్డుతేదీగా నిర్ణయించింది.