LIC | తమ ఖాతాదారుల కోసం వచ్చేనెల తొలి వారంలో ఆకర్షణీయమైన కొత్త పాలసీని మార్కెట్లోకి తీసుకొస్తామని భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి తెలిపారు. కొన్ని నెలల్లో మూడు లేదా నాలుగు కొత్త పాలసీలను తీసుకొస్తామని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డబుల్ డిజిట్ గ్రోత్ సాధనే తమ లక్ష్యం అని తెలిపారు. వచ్చేనెలలో ప్రవేశ పెట్టే పాలసీకి మంచి ఆదరణ లభిస్తుందని పేర్కొన్నారు.
మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత గ్యారంటీ రిటర్న్స్ తోపాటు 10 శాతం జీవిత కాలం అంతా ఆదాయం వచ్చేలా పాలసీ రూపొందిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ 20-25 ఏండ్ల తర్వాత వచ్చే రాబడిపై ఫోకస్ చేస్తున్నారు. కనుక తాము వచ్చే నెలలో ఆవిష్కరించే ప్రొడక్ట్‌కు మంచి గిరాకీ ఉంటుందన్నారు. రుణ పరపతితోపాటు ప్రీ- విత్ డ్రాయల్స్ ఫెసిలిటీ ఉంటుదని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో ఎల్ఐసీ కొత్త బిజినెస్ ప్రీమియం 2.65 శాతం పెరిగి రూ.25,184 కోట్లకు చేరింది. పాలసీ తీసుకున్న తొలి ఏడాది బీమా దారులు పే చేసే ప్రీమియం, ఏకమొత్తంలో చెల్లించే ప్రీమియం మొత్తం కొత్త బిజినెస్ ప్రీమియం అని భావిస్తారు. ఐఆర్డీఏఐ తెలిపిన వివరాల ప్రకారం మార్కెట్లో ఎల్ఐసీ వాటా 58.50 శాతంగా ఉంది.