LIC | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన కస్టమర్ల కోసం యూనిట్ లింక్డ్, రెగ్యులర్ ప్రీమియం, నాన్-పార్టిసిపేటింగ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ‘ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లస్’ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో పాలసీదారుకు డబుల్ బెనిఫిట్లు ఉన్నాయి. మనీ పొదుపు చేయడంతోపాటు ఇన్సూరెన్స్ కవరేజీ కూడా ఉంటుంది. పాలసీదారు దీర్ఘకాలిక పొదుపుతోపాటు గుడ్ కాంబినేషన్ ఆఫ్ సెక్యూరిటీ అందించడానికి ఈ ప్లాన్ తీసుకొచ్చింది.
ఈ ప్లాన్ కింద పాలసీదారుడికి నాలుగు ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉన్నాయి. బాండ్ ఫండ్, సెక్యూర్డ్ ఫండ్, బ్యాలెన్స్డ్ ఫండ్, గ్రోత్ ఫండ్ ఆప్షన్లు ఉన్నాయి. ఈ పాలసీ కింద ఏడాది, అర్థ సంవత్సరం, త్రైమాసికం, నెలవారీ ప్రీమియం పేమెంట్స్ ఉన్నాయి. ఈ పాలసీ ప్రీమియం చెల్లింపులు పూర్తిగా ఆన్లైన్లోనే సాగుతాయి. నెలవారీ ప్రీమియం చెల్లింపులకు15 రోజులు, త్రైమాసిక, అర్థ సంవత్సర, ఏడాది ప్రీమియం చెల్లింపులకు గడువు తేదీ నుంచి 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.
90 రోజుల పసికందు నుంచి 50 ఏండ్ల వ్యక్తుల పేరిట ఈ పాలసీ కొనుగోలు చేయొచ్చు. పాలసీ మెచ్యూరిటీకి కనీసం 18 ఏండ్లు, గరిష్టంగా 60 ఏండ్ల గడువు ఉంటుంది. పాలసీదారు 10 ఏండ్లు లేదా 20 ఏండ్ల టర్మ్ ఎంచుకోవచ్చు. రెండు టర్మ్ పాలసీలకు ప్రీమియం ఒకేలా ఉంటుంది. కనీస ప్రీమియం రూ.3000 నుంచి రూ.20000 వరకు ఉంటుంది. వార్షిక ప్రీమియం చెల్లింపులపై పది రెట్లు రిటర్న్స్ లభిస్తాయి.
పాలసీదారు అనూహ్య మరణానికి గురైతే నామినీకి మొత్తం ఫండ్ విలువ చెల్లిస్తారు. రిస్క్ కమెన్స్ మెంట్ డేట్ తర్వాత మరణిస్తే, మొత్తం ప్రీమియంపై 105 శాతం, వార్షిక ప్రీమియంపై 10 రెట్లు, మొత్తం పాలసీ ఫండ్ విలువల్లో గరిష్టం చెల్లిస్తారు.
పాలసీదారుడికి కనీసం ఐదేండ్ల గడువు ఉంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ఎంచుకోవచ్చు. అది పాలసీ మెచ్యూరిటీ తేదీ వచ్చే వరకూ కొనసాగుతుంది. ఐదేండ్ల తర్వాత పాలసీదారు అన్ని ప్రీమియంలు చెల్లించినట్లైతే మొత్తం మనీ విత్ డ్రా చేసుకోవచ్చు.
పాలసీ పీరియడ్ కాలంలో సంబంధిత పాలసీదారు పలు ఫండ్ ఆప్షన్లు మార్చుకోవచ్చు. ఒక ఫండ్ నుంచి మరో ఫండ్‌కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఇలా ఉచితంగా నాలుగు సార్లు మార్చుకోవచ్చు. అంతకు మించి ఫండ్స్ మార్చుకుంటే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. తొలుత 2015లో ప్రారంభించిన ఓల్డ్ ఎండోమెంట్ ప్లస్ ప్లాన్, 2020 ఫిబ్రవరి ఒకటో తేదీన ఉపసంహరించారు. తిరిగి న్యూ ఎండోమెంట్ ప్లస్ ప్లాన్ ప్రారంభించారు.