LIC | న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఒకేసారి నాలుగు పాలసీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎల్ఐసీ యువ టర్మ్, డిజీ టర్మ్తోపాటు యువ క్రెడిట్ లైఫ్, డిజీ క్రెడిట్ లైఫ్ పేర్లతో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సరికొత్త ప్లాన్లను కంపెనీ సీఈవో, ఎండీ సిద్దార్థ మోహంతీ ప్రారంభించారు. టర్మ్ ఇన్సూరెన్స్ కల్పించడంతోపాటు లోన్ రీపేమెంట్స్ కలిగిన ఈ పాలసీలు ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ లభించనున్నాయి.