న్యూఢిల్లీ, నవంబర్ 29: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ).. బుధవారం ‘జీవన్ ఉత్సవ్’ పేరిట ఓ గ్యారంటీడ్ రిటర్న్ ప్లాన్ను పరిచయం చేసింది. ఇదో నాన్-లింక్డ్, నాన్-పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్ సేవింగ్స్, పూర్తి జీవిత బీమా ప్లాన్ అని ఎల్ఐసీ ఓ ప్రకటనలో తెలియజేసింది. కంపెనీ చైర్మన్ సిద్ధార్థ ఇటీవల పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో.. పాలసీదారులు తాము తీసుకున్న పాలసీ మెచ్యూర్ అయ్యాక కనీసం అందులో 10 శాతాన్ని జీవితాంత ప్రయోజనంగా ఉండాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ‘జీవన్ ఉత్సవ్’ రాగా, ఇందులో ప్రీమియం కాలపరిమితి, వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఏటా ఆదాయాన్ని అందుకోవచ్చని సంస్థ చెప్తున్నది.