SEBI Approved LIC IPO | ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూసే ఎల్ఐసీ ఐపీవోకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించిందని సమాచారం. ఐపీవో కోసం దరఖాస్తు చేసుకున్న 22 రోజుల్లోనే ఎల్ఐసీకి ఆమోదం లభించడం విశేషం. ఏ కంపెనీ దాఖలు చేసిన ఐపీవో దరఖాస్తును సెబీ ఆమోదించడానికి 30-40 రోజులు పడుతుంది. కానీ ఎల్ఐసీ ఐపీవోపై సెబీ వేగంగా ప్రక్రియ పూర్తి చేసినందని తెలుస్తున్నది.
సెబీ ఆమోదం లభించిన తర్వాత ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లడమే మిగిలింది. కానీ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సర పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్య సాధనకు ఈ నెలాఖరులోపే స్టాక్ మార్కెట్లను ఎల్ఐసీ ఐపీవో తాకుతుందని ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదని ఆ సూచనలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు.
ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. స్టాక్ మార్కెట్లలో ఐపీవోకు వెళ్లడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఆర్థిక నిపుణులు చెప్పారు. ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎల్ఐసీ ఐపీవోలో పెట్టుబడు పెట్టడానికి ముందుకు రాకపోవచ్చునని భావిస్తున్నారు. కాగా, గత నెల 13న సెబీకి ఎల్ఐసీ ఐపీవో ముసాయిదా పత్రాలు సమర్పించింది.