ముంబై, సెప్టెంబర్ 19: దేశంలో రెండో అతిపెద్ద హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) కూడా వడ్డీరేట్లను పెంచింది. ఎల్ఐసీ హౌజింగ్ ప్రైమ్ లెండింగ్ రేటు(ఎల్హెచ్పీఎల్ఆర్)ని 15 బేసిస్ పాయింట్లు పెంచింది.
దీంతో ఎల్హెచ్పీఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటు మరింత పెరగనున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో విశ్వనాథా గౌడ్ మాట్లాడుతూ..ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగంలో వడ్డీరేట్లు క్రమంగా పెరుగుతున్నాయని, ఈ ఏడాది మే నుంచి ఇప్పటి వరకు ఆర్బీఐ రెపోరేటును 140 బేసిస్ పాయింట్లు పెంచిందన్నారు.