ముంబై, అక్టోబర్ 30: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్..ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక గృహ రుణ వడ్డీరేటును ప్రకటించింది. రూ.2 కోట్ల లోపు, 750 కంటే అధిక సిబిల్ స్కోర్ కలిగిన వారికి 8.40 శాతం వడ్డీకే గృహ రుణాన్ని అందిస్తున్నది. డిసెంబర్ 31 లోపు గృహ తొలిసారి గృహ రుణం తీసుకున్నవారికి మాత్రమే ఈ వడ్డీ వర్తించనున్నది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో త్రిభువన్ అధికారి మాట్లాడుతూ.. పండుగ సీజన్లో అత్యధిక మంది గృహాలు కొనుగోలు చేస్తారని, వీరికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తున్నట్టు చెప్పారు.