హైదరాబాద్, నవంబర్ 7: ప్రముఖ మౌలిక సదుపాయాల సంస్థ ఎన్సీసీ అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.163 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది నమోదైన రూ.77 కోట్ల లాభంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.5,224.36 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది. గత త్రైమాసికంలో కొత్తగా రూ.4,760 కోట్ల విలువైన ఆర్డర్లు రావడంతో మొత్తం ఆర్డర్ బుక్ విలువ రూ.52,370 కోట్లకు చేరుకున్నది.