శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 24: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. హైదరాబాద్ నుంచి ఒకేసారి ఆరు రూట్లలో విమాన సేవలు ప్రారంభించింది. మంగళవారం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అగర్తాల, జమ్ము, ఆగ్రా, కాన్పూర్, ఆయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లకు నేరుగా విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ విమాన కనెక్టివిటీ పెంచడంలో భాగంగా ఒకేసారి ఈ ఆరు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్ సీఈవో ప్రదీప్ పణికర్ వెల్లడించారు. నూతన రూట్లలో విమాన సర్వీసులు అందించడానికి ఎయిర్పోర్ట్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, ఇక్కడి నుంచి అంతరాయం లేకుండా ప్రయాణాన్ని మరింత సులభతరం చేశామని వివరించారు.