Lava Yuva 3 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా తన లావా యువ3 ప్రో ఫోన్‌ను దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. యూనీ సోక్ టీ616 ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్నదీ ఫోన్. మూడు విభిన్న కలర్ ఆప్షన్లు – డస్టర్ గోల్డ్, ఫారెస్ట్ విరిడాన్, మేడో పర్పుల్ రంగుల్లో లభిస్తుంది. లావా ఈ స్టోర్, లావా రిటైల్ నెట్వర్క్ షాపుల్లో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.8,999లకే లభిస్తుంది.
లావా యువ3ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 వర్షన్‌తోపాటు రెండేండ్ల వరకూ సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తుంది. 6.5 అంగుళాల హెచ్డీ + (720×1,600 పిక్సెల్స్) డిస్ప్లేతో వస్తుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ కలిగి ఉంటుంది. 8జీబీ ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్.. వర్చువల్‌గా 16 జీబీ ర్యామ్‌కు పొడిగించుకోవడంతోపాటు అదనంగా ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ గల ఈ ఫోన్లో మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ పెంచుకోవచ్చు.
లావా యువ3 ప్రో ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్డ్ 50- మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్‌తోపాటు 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా కూడా వస్తోంది.లావా యువ3 ప్రో ఫోన్ 4జీ వోల్ట్, బ్లూటూత్ 5, జీపీఆర్ఎస్, ఓటీజీ, వై-ఫై 802.11బీ/జీ/ఎన్ / ఏసీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఉంటాయి. యాక్సెలెరో మీటర్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ ఉంటాయి.లావా యువ3 ప్రో ఫోన్ 18 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.