Lava Agni 3 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ లావా అగ్ని3 (Lava Agni 3)ను భారత్ మార్కెట్లో శుక్రవారం ఆవిష్కరించింది. ఈ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 1.74 అంగుళాల అమోలెడ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంటది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ తోపాటు ఆండ్రాయిడ్ 14 వర్షన్ పై పని చేస్తుంది. 66వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది.
లావా అగ్ని 3 (Lava Agni 3) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.20,999 (చార్జింగ్ అడాప్టర్ లేకుండా), చార్జింగ్ అడాప్టర్ తో రూ.22,999 పలుకుతుంది. 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.24,999 పలుకుతుంది. ఈ నెల తొమ్మిదో తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి అమెజాన్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి. హీథర్ గ్లాస్, ప్రిస్టీన్ గ్లాస్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్.
లావా అగ్ని 3 (Lava Agni 3) ఫోన్ ఆండ్రాయిడ్ 14 వర్షన్ పై పని చేస్తుంది. మూడేండ్ల పాటు ఓఎస్ వర్షన్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 4ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7300ఎక్స్ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా విత్ 112 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 8-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ విత్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఈఐఎస్), సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 16 -మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా విత్ ఈఐఎస్ ఉంటుంది.
లావా అగ్ని 3 (Lava Agni 3) ఫోన్లో ఎక్స్ టర్నల్ మెమొరీ కార్డు సాయంతో 256 జీబీ స్టోరేజీ కెపాసిటీని పెంచుకోవచ్చు. 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.4, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సిలరో మీటర్, గైరో స్కోప్, ఈ-కంపాస్, అంబియెంట్ లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ ఉంటాయి. 66వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 19 నిమిషాల్లో బ్యాటరీ 50 శాతం చార్జింగ్ ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేసన్ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది.