PAN-Aadhaar | పాన్ కార్డు.. ఆర్థిక లావాదేవీలు జరపడానికి.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి గుర్తింపు కార్డు.. ఆధార్ కార్డు విశ్వజనీన గుర్తింపు కార్డు. బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించాలంటే ఆధార్, పాన్ కార్డు సమర్పించాల్సిందే. వాటిని అనుసంధానం చేయాలని ఇంతకుముందే ఆదాయం పన్ను విభాగం, కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేశాయి. తాజాగా ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి ఈ నెలాఖరు వరకు గడువు పొడిగించింది ఐటీ విభాగం. గడువులోగా అనుసంధానించకుంటే పాన్ కార్డు ఇన్-యాక్టివ్ అంటే చెల్లుబాటు కాదు. అలా ఇన్-యాక్టివ్ అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో, స్టాక్స్‌లో ఖాతాలు తెరవలేరు.. లావాదేవీలు నిర్వహించలేరు. అంతే కాదు.. ఆదాయం పన్ను చట్టం-1961లోని 272బీ సెక్షన్ కింద రూ.10 వేల పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినా.. ఆదాయం ఆధారంగా అధిక పన్ను పే చేయాల్సి రావచ్చు.
కానీ చాలా మందికి పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం ఎలా, ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితి. ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో ఉచితంగా పాన్ కార్డు-ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..
ఇప్పటికీ పాన్ కార్డు-ఆధార్ అనుసంధానించలేదా.. అయితే ఈ నెలాఖరు వరకు రూ.1000 పెనాల్టీ చెల్లించి అనుసంధానం చేసుకోవచ్చు. మీరే స్వయంగా ఆ పని చేసేయవచ్చు. అందుకు ఆదాయం పన్ను అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి వాటిని లింక్ చేయాలి.
ఆదాయం పన్ను చట్టం -1961 కింద పాన్ కార్డు-ఆధార్ కార్డు అనుసంధానం నుంచి కొందరిని మినహాయించారు. అసోం, మిజోరం, జమ్ముకశ్మీర్, మేఘాలయ రాష్ట్రాల పౌరులు, ఎన్నారైలు, 80 ఏండ్ల వయస్సు దాటిన వారు, విదేశీయులకు మినహాయింపు ఉంటుంది.
Pan-Aadhar link | దగ్గర పడుతున్న ఆధార్‌తో పాన్‌కార్డు అనుసంధానం గడువు .. బీ అలర్ట్..!
PAN-Aadhar | ఐటీ శాఖ హెచ్చరిక.. తక్షణం పాన్-ఆధార్ అనుసంధానించండి.. లేదంటే?!
PAN-Aadhar Link | ఆధార్‌తో పాన్ కార్డు లింక్ తప్పనిసరి.. లేదంటే!!