న్యూఢిల్లీ, జూన్ 8: ఇటలీకి చెందిన సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘినీ..దేశీయ మార్కెట్లోకి సరికొత్త హ్యురాక్ ఈవో రియర్-వీల్ డ్రైవ్ స్పైడర్ను పరిచయం చేసింది. ఈ కారు ధర రూ.3.54 కోట్లుగా నిర్ణయించింది. వీ10 ఇంజిన్ కలిగిన ఈ కారు 610 హెచ్పీ, కేవలం 3.5 సెకండ్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది. గంటకు 324 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోనున్నదని తెలిపింది. నూతన డ్రైవింగ్ అనుభవం కోరుకుంటున్న వారికి ఈ కారు సరైనదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.