వొడాఫోన్ ఐడియాలో నా వాటా ఇచ్చేస్తా: కుమార మంగళం బిర్లా
అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్)లో తన వాటాను ప్రభుత్వం లేదా ప్రభుత్వం చెప్పిన ఏదైనా సంస్థకు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పడం గమనార్హం.

న్యూఢిల్లీ: అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (వీఐఎల్)లో తన వాటాను ప్రభుత్వం లేదా ప్రభుత్వం చెప్పిన ఏదైనా సంస్థకు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా చెప్పడం గమనార్హం. ఈ కంపెనీ కొనసాగాలన్న ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు గత జూన్లోనే ఆయన ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తాజాగా వెల్లడైంది. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు బిర్లా ఈ లేఖ రాశారు. అధికారిక లెక్కల ప్రకారం.. వీఐఎల్ అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఏజీఆర్) లయబిలిటీ రూ.58,254 కోట్లుగా ఉంది. ఇందులో సంస్థ ఇప్పటికే రూ.7,854 కోట్లు చెల్లించగా.. ఇంకా రూ.50,399 కోట్లు చెల్లించాల్సి ఉంది.
ఈ ప్రభుత్వ అంచనాలను సవరించాలని కోరుతూ వీఐఎల్, భారతీ ఎయిర్టెల్ సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకపోయింది. వీఐఎల్లో కుమార మంగళం బిర్లాకు 27 శాతం వాటా ఉంది. ఏజీఆర్ లయబిలిటీపై స్పష్టత లేక ఇన్వెస్టర్లు తమ కంపెనీలో పెట్టుబడి పెట్టడం లేదని బిర్లా ఆ లేఖలో చెప్పారు. దీంతోపాటు మరో రెండు అంశాలను కూడా లేవనెత్తారు. వీటిపై వెంటనే ప్రభుత్వ మద్దతు లేకపోతే వీఐఎల్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారి, పూర్తిగా పతనమయ్యే ప్రమాదం ఉన్నదని జూన్ 7న రాసిన ఈ లేఖలో బిర్లా స్పష్టం చేశారు. 27 కోట్ల కస్టమర్లు ఉన్న వీఐఎల్ సంస్థను బతికించుకునేందుకు తన వాటాను ఎవరికైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా అందులో చెప్పారు. ఆ లేఖ తర్వాత ప్రభుత్వం ఏమైనా స్పందించిందా, బిర్లాతో చర్చలు జరిగాయా అన్నదానిపై స్పష్టత లేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

