KTM 390 Adventure X | ఆస్ట్రేలియా మోటారు సైకిళ్ల తయారీ సంస్థ `కేటీఎం` దేశీయ మార్కెట్లో టూరిస్ట్ బైక్ న్యూ వేరియంట్ `కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్ (KTM 390 Adventure X)` ఆవిష్కరించింది. దీని ధర రూ.2.80 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న అడ్వెంచర్ మోడల్ బైక్ కంటే కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్ బైక్ రూ.58 వేలు చౌక. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కేటీఎం 390 అడ్వెంచర్ బైక్ ధర రూ.3.38 లక్షలు.
కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్ (KTM 390 Adventure X) బైక్ ఇంజిన్ 373.2 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 9000 ఆర్పీఎం వద్ద 42.9 బీహెచ్పీ విద్యుత్, 7000 ఆర్పీఎం వద్ద 37 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తున్నది. 43 ఎంఎం యూఎస్డీ ఫ్రంట్ ఫోర్క్, రేర్ మోనో షాక్ అబ్సార్బర్ కూడా ఉన్నాయి.
కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్ (KTM 390 Adventure X) బైక్ ఫ్రంట్ వీల్‌పై 320 ఎంఎం సింగిల్ డిస్క్ బ్రేక్, రేర్ వీల్‌పై 230 ఎంఎం డిస్క్ బ్రేక్‌తో వస్తున్నది. ఫ్యుయల్ కెపాసిటీ బ్రేకింగ్తోపాటు బ్రేక్ వేయడానికి ఏబీఎస్ కంట్రోల్ ఉంటుంది. ఈ ఇంజిన్‌లో 14.5 లీటర్ల పెట్రోల్ నింపవచ్చు. లీటర్ పెట్రోల్‌పై 27.58 కిలోమీటర్ల మైలేజీ లభిస్తుంది.
కేటీఎం 390 అడ్వెంచర్ ఎక్స్ (KTM 390 Adventure X) బైక్‌లో కంప్లీట్ ఎల్ఈడీ లైటింగ్ విత్ డ్యుయల్ చానెల్ ఏబీఎస్, స్లిప్పర్ క్లచ్, 12-వోల్ట్ యూఎస్బీ షాకెట్ విత్ ఆఫ్‌రోడ్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. మరోవైపు టీఎఫ్టీ డిస్ప్లే స్థానంలో ఎల్సీడీ స్క్రీన్ వస్తుంది.