KTM 200 Duke | ప్రముఖ ప్రీమియం టూ వీలర్స్ తయారీ సంస్థ కేటీఎం.. తన పాపులర్ కేటీఎం200 డ్యూక్ అప్ గ్రేడెడ్ మోటారు సైకిల్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. కొత్తగా 5-అంగుళాల కలర్డ్ టీఎఫ్టీ డిస్ ప్లేతో వస్తున్న ఈ మోటారు సైకిల్ ధర రూ.2,03,412 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. కేటీఎం200 డ్యూక్ అప్ గ్రేడెడ్ మోటారు సైకిల్ లో వాడిన టీఎఫ్టీ డిస్ ప్లేను థర్డ్ జనరేషన్ కేటీఎం 390 డ్యూక్ నుంచి తీసుకొచ్చారు. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీతోపాటు అన్ని రకాల బైక్ ఫంక్షన్స్ కోసం న్యూ స్విచ్ క్యూబ్ అండ్ ఫోర్ వే మెనూ స్విచ్చెస్తో కూడిన బాండెడ్ గ్లాస్ డిస్ ప్లే ఉంటుంది. బ్లూటూత్ ద్వారా కేటీఎం మై రైడ్ యాప్ యూజ్ చేస్తూ ప్లే మ్యూజిక్, ఇన్ కమింగ్ ఫోన్ కాల్స్ స్వీకరణ, యూజ్ టర్న్ బై టర్న్ నేవిగేషన్ తదితర కనెక్టివిటీ ఫంక్షన్లను వినియోగించుకోవచ్చు.
సూపర్ మోటో ఏబీఎస్ మోడ్లో వస్తోంది కేటీఎం 200 డ్యూక్ మోటారు సైకిల్. రైడర్లు లెఫ్ట్ హ్యాండిల్ బార్ మౌంటెడ్ మెనూ స్విచ్ వినియోగించి ఆర్పీఎం షిప్ట్/ లిమిట్ నియంత్రించవచ్చు. డార్క్ థీమ్డ్ , ఆరంజ్ థీమ్డ్ డిస్ ప్లే మధ్య 5-అంగుళాల కలర్డ్ టీఎఫ్టీ డిస్ ప్లే పరివర్తన చెందుతుంది. కేటీఎం 200 డ్యూక్ మోటారు సైకిల్ 199.5 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, డీఓహఎచ్సీ, ఈఎఫ్ఐ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 25 పీఎస్ విద్యుత్, 19.3 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఆల్ ఎల్ఈడీ లైటింగ్, డబ్యూపీ యూఎస్డీ, మోనోషాక్, లైట్ వెయిట్ ట్రెల్లిస్ ఫ్రేమ్ విత్ అల్యూమినియం స్విన్ గ్రామ్ ఉంటాయి. కేటీఎం 200 డ్యూక్ మోటారు సైకిల్ డార్క్ గాల్వనో, ఎలక్ట్రానిక్ ఆరెంజ్, మెటాలిక్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.