కొటక్ మహీంద్రా రుణాలు చౌక
ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను సవరించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది.
- ఏడాది ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్లు తగ్గించిన బ్యాంక్
న్యూఢిల్లీ, నవంబర్ 16: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను సవరించింది. ఏడాది ఎంసీఎల్ఆర్ను 20 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది.
దీంతో ఆటో, గృహ, వ్యక్తిగత రుణాల వంటి కన్జ్యూమర్ లోన్లపై వడ్డీరేటు 8.75 శాతం నుంచి 8.55 శాతానికి దిగొచ్చింది. అయితే మిగతా అన్ని కాలవ్యవధి ఎంసీఎల్ఆర్లను బ్యాంక్ పెంచడం గమనార్హం. ఫలితంగా 15 రోజుల నుంచి మూడేండ్ల వరకు ఎంసీఎల్ఆర్లు 7.8 శాతం నుంచి 9.05 శాతం శ్రేణిలో ఉన్నాయి. నెలనెలా ఎంసీఎల్ఆర్ను కొటక్ సవరిస్తున్నది. ఇక మారిన ఈ వడ్డీరేట్లు వెంటనే అమల్లోకి వస్తాయని బ్యాంక్ తమ వెబ్సైట్లో స్పష్టం చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

