న్యూఢిల్లీ : పాశ్చాత్య దేశాల్లో ప్రాచుర్యం పొందిన స్మార్ట్ టాయ్‌లెట్ కాన్సెప్ట్ విస్తృతమవుతోంది. టాయిలెట్లో మీరు ఊహించని సౌకర్యాలు, ఫీచర్లతో కొహ్లర్ నుమి 2.0 స్మార్ట్ టాయ్‌లెట్ పలువురిని ఆకట్టుకుంటోంది. 2.0 స్పీకర్లు, అలెక్సా, హీటెడ్ సీట్, రిమోట్ కంట్రోల్ ఓపెనింగ్, క్లోజింగ్ వంటి ఫీచర్లతో కొహ్లర్ నుమి రూ. 9 లక్షల నుంచి కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కొహ్లర్ తొలుత నుమి 2.0 స్మార్ట్ టాయ్‌లెట్‌ను సీఈఎస్ 2019లో ప్రదర్శించగా ఇప్పుడు అది అమ్మకానికి సిద్ధంగా ఉంది.
స్మార్ట్ టాయ్‌లెట్ కోసం ఈ ధర పెట్టవచ్చని ఇందులో బిల్టిన్ అలెక్సా, పలు రకాల ఎల్ఈడీ లైట్లు మిరుమిట్లు గొలిపేలా ఉంటాయి. టాయిలెట్‌కు అటాచ్ అయిన స్పీకర్‌కు ఫోన్ కనెక్ట్ చేసుకుని ఇష్టమైన మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. వాతావరణం బాగా చల్లగా ఉంటే సీట్‌ను వేడిగా మార్చే టెక్నాలజీతో స్మార్ట్ టాయిలెట్‌ను డెవలప్ చేశారు. పలురకాల ఫ్రాగ్రెన్స్లను ఆస్వాదించేలా ఆటో డియోడరైజింగ్ మోడ్ వెసులుబాటు ఉంది.
ఆరోగ్య సమస్యలు ఉన్న వారి కోసం కొహ్లర్ నుమి 2.0 హైట్ అడ్జస్ట్మెంట్ ఫీచర్‌ను కలిగిఉంది. వీటితో పాటు ఆటో డ్రైయర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. కొహ్లర్ కనెక్ట్ యాప్‌తో అనుసంధానించిన రిమోట్ ద్వారా ఈ ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. ఇక భారత్‌లో కొహ్లర్ ఇంకా స్మార్ట్ టాయ్లెట్లను ప్రవేశపెట్టకపోవడంతో దేశీ మార్కెట్లో నుమి 2.0 ఎప్పుడు లాంఛ్ అవుతుందనే సమాచారం అందుబాటులో లేదు.