మంగళవారం 26 మే 2020
Business - May 23, 2020 , 00:33:07

జియోతో జతకట్టిన కేకేఆర్‌

జియోతో జతకట్టిన కేకేఆర్‌

  • రూ.11,367 కోట్లు పెట్టుబడిపెట్టనున్న అమెరికా సంస్థ

న్యూఢిల్లీ, మే 22: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికం వెంచర్‌ జియోలో మరో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనున్నది. అమెరికాకు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ కేకేఆర్‌ రూ.11,367 కోట్లతో 2.32 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. గడిచిన నాలుగు వారాల్లో జియో కుదుర్చుకున్న ఐదో ఒప్పందమిది. ఆసియా దేశాల్లో కేకేఆర్‌ అతిపెద్ద పెట్టుబడిదారు కావడం విశేషం. దీంతో మొత్తం పెట్టుబడి రూ.78,562 కోట్లకు చేరుకున్నాయి. జియో ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్‌ప్రైజెస్‌ విలువ రూ.5.16 లక్షల కోట్ల ఆధారంగా ఈ కొనుగోలు ఒప్పందం జరిగిందని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. జియోలో ఇదివరకే ఫేస్‌బుక్‌ 9.99 శాతం, సిల్వర్‌ లేక్‌ 1.15 శాతం, విస్టా ఈక్విటీ 2.32 శాతం, జనరల్‌ అట్లాంటిక్‌ 1.34 శాతం వాటాలను కొనుగోలు చేశాయి.


logo