హైదరాబాద్, జూలై 16: ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్టీసీసీఐ) నూతన కార్యవర్గాన్ని గురువారం ప్రకటించించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఎఫ్టీసీసీఐ ప్రెసిడెంట్గా కృష్ణ కుమార్ మహేశ్వరీ (కేకే మహేశ్వరీ) ఎంపికగా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ గరిమెళ్ల నియమితులయ్యారు. ఎఫ్టీసీసీసీఐ ప్రెసిడెంట్గా నియమితులైన కేకే మహేశ్వరి..రవి కుమార్ నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు.