హైదరాబాద్, నవంబర్ 9: రాష్ర్టానికి చెందిన ప్రముఖ హెల్త్‌కేర్ సేవల సంస్థ కిమ్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.121 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.101 కోట్ల కంటే ఇది 20 శాతం అధికమని పేర్కొంది. అలాగే సమీక్షకాలంలో రూ.782 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఆర్జించింది.