న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా.. కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి సెల్టోస్, కారెన్స్ మాడళ్ళ ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్టు కియా ఇండియా నేషనల్ హెడ్(సేల్స్ అండ్ మార్కెటింగ్) హర్దీప్ ఎస్ బ్రార్ తెలిపారు.
ముడి సరుకుల ధరలు పెరగడం వల్లనే ధరలను పెంచాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కానీ, ఎంట్రీలెవల్ మాడల్ సోనెట్‌ను ఈ పెంపునుంచి మినహాయించడం విశేషం.