Kia Syros | దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India).. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్యూవీ (Sub-4 Metre Compact SUV) కియా సిరోస్ (Kia Syros) కారును దేశీయ మార్కెట్లో ఆవిస్కరించింది. ఈ కారు ధర రూ.9 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్) ప్రారంభం అవుతుంది. టాప్ వేరియంట్ కారు ధర రూ.17.80 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఇతర కార్లతో కాంపిటీటివ్‌గా ఉండటంతోపాటు ప్రయాణించే వారికి కంఫర్ట్‌గా, స్పేసియస్‌గా ఉంటుంది. పలు అద్భుతమైన ఫీచర్లు, పవర్ ట్రైన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఈ సెగ్మెంట్లో మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి బ్రెజా (Maruti Suzuki Brezza), టాటా నెక్సాన్ (Tata Nexon), హ్యుండాయ్ వెన్యూ (Hyundai Venue), మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) కార్లకు గట్టి పోటీ ఇస్తుందీ కియా సైరోస్ (Kia Syros).
కియా సైరోస్ (Kia Syros) రెండు ఇంజిన్ ఆప్షన్లు – స్మార్ట్ స్ట్రీమ్ 1.0 లీటర్ టీ-జీడీఐ పెట్రోల్ (Smartstream 1.0-litre T-GDi petrol), 1.5 లీటర్ల సీఆర్డీఐ వీజీటీ డీజిల్ (1.5-litre CRDi VGT diesel) ఆప్షన్లలో లభిస్తుంది. టీ-జీడీఐ పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 120పీఎస్ విద్యుత్, 172ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. సీఆర్డీఐ వీజీటీ డీజిల్ ఇంజిన్ (CRDi VGT diesel) గరిష్టంగా 116పీఎస్ విద్యుత్, 250ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. టీ-జీడీఐ పెట్రోల్ ఇంజిన్ (T-GDi petrol engine) కారు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 7-స్పీడ్ డీసీటీ, సీఆర్డీఐ వీజీటీ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది.
కియా సైరోస్ (Kia Syros) కారు సిక్స్ ట్రిమ్స్- నాలుగు స్టాండర్డ్, రెండు ఆప్షన్లు – హెచ్టీకే (HTK), హెచ్టీకే (ఓ) (HTK-O), హెచ్టీకే + (HTK+), హెచ్‌టీఎక్స్ (HTX), హెచ్‌టీఎక్స్+ (HTX+), హెచ్‌టీఎక్స్+ (ఓ) (HTX+-O) ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
కియా సిరోస్ టీ-జీడీఐ పెట్రోల్ (Kia Syros T-GDi petrol)
హెచ్టీకే 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.9 లక్షలు
హెచ్టీకే (ఓ) 6మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.10 లక్షలు
హెచ్టీకే + 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్- రూ. 11.50 లక్షలు
హెచ్‌టీఎక్స్ 6మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.13.30 లక్షలు
హెచ్టీకే+ 7డీసీటీ – రూ.12.80 లక్షలు
హెచ్‌టీఎక్స్ 7డీసీటీ – రూ.14.60 లక్షలు
హెచ్‌టీఎక్స్+ 7డీసీటీ – రూ.16 లక్షలు
హెచ్‌టీఎక్స్+(ఓ) 7డీసీటీ – రూ. 16.80 లక్షలు
కియా సిరోస్ సీఆర్డీఐ వీజీటీ డీజిల్ (Kia Syros CRDi VGT diesel)
హెచ్టీకే (ఓ) 6మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.11 లక్షలు
హెచ్టీకే + 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.12.50 లక్షలు
హెచ్‌టీఎక్స్ 6మాన్యువల్ ట్రాన్స్మిషన్ – రూ.14.30 లక్షలు
హెచ్‌టీఎక్స్+ 6ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ – రూ.17 లక్షలు
హెచ్‌టీఎక్స్ + (ఓ) 6ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ – రూ.17.80 లక్షలు
దేశీయ మార్కెట్లోకి అత్యధిక ఫీచర్లతో వస్తున్న సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్‌యూవీగా కియా సైరోస్ (Kia Syros) నిలుస్తుంది. హై ఎండ్ వేరియంట్ కార్లు లెవల్-2 అడాస్ ఫీచర్లతో వస్తున్న కార్ల ధరలు ఎక్కువగానే ఉంటాయి. కే1 ప్లాట్‌ఫామ్‌పై (K1 platform)పై రూపుదిద్దుకున్న న్యూ కియా ఎస్యూవీ ఈ కియా సైరోస్ (Kia Syros). కార్నివాల్ లగ్జరీ ఎంపీవీ (Carnival MPV), ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఈవీ9 (Electric EV9) స్ఫూర్తితో రూపుదిద్దుకున్నది కారు. కారు ఫ్రంట్‌లో కియా సిగ్నేచర్ డిజిటల్ టైగర్ ఫేస్‌తో సిగ్నేచర్ స్టార్ మ్యాప్ ఎల్ఈడీ లైటింగ్ (హెడ్ ల్యాంప్స్, డీఆర్ఎల్స్), రేర్‌లో ఎల్-షేప్డ్ ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ (L-shaped LED taillamps) ఉంటాయి. 17- అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. కియా లోగో ప్రొజెక్షన్తోపాటు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పడల్ ల్యాంప్స్ ఉంటాయి.
కియా సైరోస్ (Kia Syros) కారు 30-అంగుళాల ట్రినిటి పనోరమిక్ డిస్ప్లే ప్యానెల్ (ఇన్ఫోటైన్మెంట్, క్లైమేట్ కంట్రోల్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్), వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కనెక్టెడ్ కార్ నేవిగేషన్ కాక్‌పిట్, అల్లాయ్ పెడల్స్, 64 కలర్ అంబియెంట్ మూడ్ లైటింగ్, ఫోర్ వే పవర్డ్ డ్రైవర్ సీట్, హార్మన్ కార్డోన్ 8-స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ చార్జర్, డ్యుయల్ పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటాయి. సబ్-4 మీటర్ కంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోనే తొలిసారి ఫస్ట్, సెకండ్ రో సీట్లన్నీ వెంటిలెటెడ్గా ఉంటాయి. సెకండ్ రో సీట్లు సైతం తొలిసారి స్లైడింగ్, రీసైక్లింగ్ ఫీచర్లు జత చేశారు.
ఈ సెగ్మెంట్లోనే తొలిసారి ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) సాఫ్ట్వేర్ అప్డేట్స్, 22 కంట్రోలర్ల ఆటోమేటిక్ అప్డేటింగ్ వంటి 80కి పైగా కనెక్టెడ్ ఫీచర్లతో వస్తోంది కియా సైరోస్ (Kia Syros).ఇందులో కార్ సెంటర్-అసిస్టెడ్ నావిగేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. లెవల్ 2 అడాస్ లో ఫార్వర్డ్ కొల్లిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్, 360-డిగ్రీ కెమెరా విత్ బ్లైండ్ వ్యూ మానిటర్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, విత్ స్టాప్ అండ్ గో తదితర ఫీచర్లతోపాటు 16 అటానమస్ ఫీచర్లు ఉంటాయి.
కియా సైరోస్ (Kia Stros)లో కియా ఇండియా సేఫ్టీపై ప్రత్యేక అటెన్షన్ కలిగి ఉంటుంది. సిక్స్ ఎయిర్బ్యాగ్స్తోపాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ 20 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు జత చేశారు. కియా కనెక్ట్ 2.0, ఎస్‌వోఎస్ ఎమర్జెన్సీ సపోర్ట్, రియల్ టైం డయాగ్నస్టిక్స్, స్టోలెన్ వెహికల్ ట్రాకింగ్ ఫీచర్లూ ఉంటాయి.