Kia Syros | అద్భుతమైన ఫీచర్లతో కియా ఇండియా (Kia India) తీసుకొచ్చిన ఎస్యూవీ కారు కియా సైరోస్ (Kia Syros) బుకింగ్స్ జనవరి మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ)తో వస్తున్న మూడో కియా కారు ఇది. ఫిబ్రవరి నుంచి కార్ల డెలివరీ ప్రారంభం అవుతుంది. కియా ఈవీ9 (Kia EV9) స్ఫూర్తిగా రూపుదిద్దుకున్న కియా సైరోస్ (Kia Syros) లోనూ ఉంటాయి. కియా ఫ్లాగ్ షిప్ సైరోస్ కారు ధర రూ.1.29 కోట్లు (ఎక్స్ షోరూమ్) ఉండొచ్చునని భావిస్తున్నారు. సెకండ్ రో వెంటిలేషన్, డ్యుయల్ పేన్ పనోరమిక్ సన్ రూఫ్, లెవల్ 2 అడాస్ సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి. సిగ్నేచర్ డిజిటల్ ‘టైగర్ ఫేస్’ గ్రిల్లె, ‘ఐస్ క్యూబ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ‘స్టార్ మ్యాప్’ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్స్, రేర్‌లో ‘స్టార్ మ్యాప్’ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్’, షార్క్ ఫిన్ ఎంటీనా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ఉంటాయి.
కియా సైరోస్ 17- అంగుళాల క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్, పడెల్ ల్యాంప్స్, కియా లోగో, 30- అంగుళాల ట్రినిటి పనోరమిక్ డిస్ ప్లే ప్యానెల్ ఫర్ ఇన్ఫోటైన్ మెంట్, క్లైమేట్ కంట్రోల్, ఇన్ స్ట్రుమెంట్ ప్యానెల్, సెంట్రల్ కన్సోల్, ఇంటిగ్రేటింగ్ ఫిజికల్ బటన్స్, టైప్ – సీ పోర్ట్స్, వైర్ లెస్ చార్జర్, గేర్ లివర్ తదితర ఫీచర్లతో సొగసుగా కనిపిస్తుందీ కారు.
ఫ్రంట్ కొల్లిషన్ వార్నింగ్, ఫ్రంట్ కొల్లిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్, లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ ఫాలో అసిస్ట్, హై బీం అసిస్ట్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, పార్కింగ్ కొల్లిషన్ అవాయిడెన్స్ అసిస్ట్, 360 డిగ్రీ కమెరా విత్ బ్లైండ్ వ్యూ మిర్రర్ వంటి లెవల్ 2 అడాస్ ఫీచర్లు ఉంటాయి. డ్యుయల్ పేన్ పనోరమక్ సన్ రూఫ్ కూడా పలువురు కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.