Kia Sonet facelift |దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా తన పాపులర్ సబ్-4 మీటర్ ఎస్యూవీ.. కియా సొనెట్ 2024 ఫేస్ లిఫ్ట్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. అప్ డేటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, న్యూ అల్లాయ్ వీల్స్‌తోపాటు న్యూ డిజైన్డ్ గ్రిల్లె ఉంటుంది. ఇంటీరియర్‌గా న్యూ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, వెంటిలేటెడ్ సీట్స్, న్యూ సీట్ అప్హోల్స్టరీ తదితర ఫీచర్లు కూడా ఉంటాయి. న్యూ కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ కారు 360-డిగ్రీ కెమెరా, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ టెక్నిక్స్ (అడాస్) తోపాటు 25 సేఫ్టీ ఫీచర్లతో వస్తున్నది. భారత్ తోపాటు గ్లోబల్ మార్కెట్లో గత నెల 14న ఆవిష్కరించింది. తొమ్మిది కలర్ ఆప్షన్లలో మార్కెట్లోకి వచ్చింది.
ఫేస్ లిఫ్టెడ్ కియా సోనెట్ 2024 కారు రూ.7.99 లక్షల నుంచి రూ.15.69 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. అప్ డేటెడ్ కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ కారు ధర రూ.20 వేలు ఎక్కువ పలుకుతుంది. టాప్ వేరియంట్ కారుపై రూ.80 వేలు ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రీ బుకింగ్ కోసం రూ.25 వేల టోకెన్ మనీ చెల్లిస్తే చాలు. కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ కారు పాత మోడల్ కంటే స్టయిలిష్ గా ఉంటుంది. మహీంద్రా ఎక్స్‌యూవీ700లో మాదిరిగా రెండు వైపులా అగ్రెసివ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ విత్ సాబెర్ తూట్ స్టైల్, ఫ్రంట్ బంపర్ మీద గ్రిల్లె దిగువన థిన్ ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్ ఏర్పాటు చేస్తారు.
కియా సెల్టోస్‌లో మాదిరిగా 16-అంగుళాల స్పోర్టీ క్రిస్టల్ కట్ అల్లాయ్ వీల్స్, ఫుల్లీ కవర్డ్ బాడీ క్లాడింగ్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, రూప్ రెయిల్స్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ ఎయిరో డైనమిక్ రేర్ స్కిడ్ ప్లేట్ విత్ రేర్ స్పాయిలర్, డార్క్ మెటాలిక్ అస్కెంట్ ఫీచర్లు ఉంటాయి.
కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్‌గా డాష్ బోర్డుపై 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ ఇన్ ఫర్మేషన్ డిస్ ప్లే, బ్రౌన్ కలర్డ్ థీమ్ క్యాబిన్, 70 కనెక్టెడ్ కార్ ఫీచర్లతోపాటు ఇన్ఫోటైన్మెంట్ టచ్ స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 4-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, 7-స్పీకర్ బోస్ ఆడియో సిస్టమ్, వైర్ లెస్ ఫోన్ చార్జింగ్, ఇన్ బిల్ట్ ఎయిర్ ప్యూరిఫయర్, 360 డిగ్రీ కెమెరా, వాయిస్ ఆపరేటెడ్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు కూడా జత చేశారు.
మల్టీపుల్ ఇంజిన్ ఆప్షన్లతో కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్ వస్తున్నది. ఎంట్రీ లెవల్ కారు 1.2 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (82 బీహెచ్పీ పెట్రోల్, 115 ఎన్ఎం టార్క్) విత్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (118 బీహెచ్పీ విద్యుత్, 172 ఎన్ఎం టార్క్) విత్ 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ లేదా 6-స్పీడ్ క్లచ్ లెస్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది. దీంతోపాటు 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ విత్ 6-స్పీడ్ క్లచ్ లెస్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కూడా కలిగి ఉంటుంది. పెట్రోల్ ఇంజిన్ లీటర్ పెట్రోల్ మీద 18.82 కి.మీ., డీజిల్ ఇంజిన్ లీటర్ డీజిల్ మీద 22.3 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది.
2020లో మార్కెట్లో విడుదల చేసిన తర్వాత కియా సోనెట్ ఎస్యూవీ కారు అప్ డేట్ కావడం ఇదే తొలిసారి. మూడు వేరియంట్లు, ఐదు ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ధర రూ.8 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. మారుతి బ్రెజా, టాటా నెక్సాన్, హ్యుండాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, రెనాల్ట్ కైగర్, నిసాన్ మ్యాగ్నైట్ కార్లతో పోటీ పడుతుందీ కారు.