Kia Seltos facelift | కార్ల ప్రేమికులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వచ్చేసింది. 2023 కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ పలు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అప్‌గ్రేడ్స్‌తో మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 14 నుంచి కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ మూడు వేరియంట్లు – ఎక్స్ లైన్, జీటీ లైన్, టెక్ లైన్ వేరియంట్లలో లభిస్తుంది. 2023 కియా సెల్టోస్.. రెండు మాట్టె గ్రాఫైట్ ఫినిష్ కలర్ ఆప్షన్లతోపాటు 8 కలర్స్‌లో సొంతం చేసుకోవచ్చు.
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్‌లో ఇంటిగ్రేట్ అయిన రీ డిజైన్డ్ డీఆర్ఎల్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్, స్లైట్లీ అప్డేటెడ్ సిగ్నేచర్ టైగర్ నోస్ అసెంట్స్, 18-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, న్యూలీ డిజైన్డ్ ఎల్ఈడీ కనెక్టెడ్ టైల్ ల్యాంప్స్, డ్యుయల్ ఎగ్జాస్ట్ టిప్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. టాప్-స్పెషిఫికేషన్స్ వేరియంట్లలో ఎలక్ట్రికల్లీ పవర్డ్ టెయిల్ గేట్ ఉంటుంది.
బ్లాక్ / గ్రే లేదా బ్లాక్/ కామెల్ బ్రౌన్ డ్యుయల్ టోన్ ఇంటరీయర్ థీమ్స్‌తో వస్తున్న కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్.. డ్యుయల్ 10.25 అంగుళాల డిస్ ప్లే, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ టీఎఫ్టీ ఇన్స్రుమెంట్ క్లస్టర్ ఎట్ సెంట్రల్ కన్సోల్, వాయిస్ కంట్రోల్డ్ పనోరమిక్ సన్ రూఫ్, 8-స్పీకర్ ప్రీమియం బోస్ ఆడియో సిస్టమ్, డ్యూయల్ జోన్ ఆటోమ్యాటిక్ ఏసీ, ఎయిర్ ఫ్యూరిఫయర్, యాంబియెంట్ లైటింగ్ విత్ ఎల్ఈడీ సౌండ్ మూడ్ లైట్స్, వెంటిలేటెడ్ ఫ్రండ్ సీట్స్ విత్ 8-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవింగ్ సీట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ న్యూ 1.5-లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ తో వస్తున్నది. ఇది గరిష్టంగా 158 హెచ్‌పీ విద్యుత్, 253 ఎన్ఎం మ్యాక్స్ టార్చి వెలువరిస్తుంది. ఈ ఎస్యూవీ మోడల్ కారు ఐదు ట్రాన్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. మాన్యువల్, సెమీ-ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లలో లభ్యమవుతుంది. ఇంతకుముందు మోడల్ సెల్టోస్ లో మాదిరిగా కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ లో కూడా 1.5 లీటర్ల ఫోర్-సిలిండర్ పెట్రోల్ లేదా డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
సేఫ్టీ కోసం అడాస్ 2.0 సిస్టమ్ కలిగి ఉంటుంది కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డిస్కెంట్ కంట్రోల్, ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ యాంకరేజెస్ తదితర ఫీచర్లతో వస్తున్నది.