Kia – Carens | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా (Kia India) తన కరెన్స్ -2024 (Kia Carens-2024) కారును పలు మార్పులతో మంగళవారం ఆవిష్కరించింది. తొమ్మిది కొత్త వేరియంట్లలో కరెన్స్ ఫేస్ లిఫ్ట్ లభిస్తుంది. దీంతో కియా కరెన్స్ మొత్తం 30 వేరియంట్లలో లభిస్తుంది. న్యూ డీజిల్ పవర్ ట్రైన్, ఎక్స్టీరియర్ కలర్ తోపాటు పలు నూతన ఫీచర్లు జత చేశారు. కరెన్స్ ధర రూ.10.52 లక్షలు (ఎక్స్ షోరూమ్) కాగా, కొత్త వేరియంట్ కార్ల ధరలు రూ.12.12 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి టాప్ హై ఎండ్ వేరియంట్ ఎక్స్-లైన్ వేరియంట్ రూ.19.67 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది.
కియా కరెన్స్ ఫేస్ లిఫ్ట్-2024లో కొత్తగా 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ విత్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఉంటుంది. ఆరు, ఏడు సీట్ల కాన్పిగరేషన్తో న్యూ యూ2 1.5వీజీటీ డీజిల్ మాన్యువల్ ఆప్షన్ కారు వస్తుంది. ప్రీమియం, ప్రీమియం (ఓ), ప్రిస్టీజ్, ప్రిస్టీజ్+, లగ్జరీ, లగ్జరీ + ట్రిమ్స్‌లో కియా కరెన్స్ లభిస్తుంది.
కియా కరెన్స్ -2024 కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ల టర్బో పెట్రోల్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. యూ2 1.5 వీజీటీ డీజిల్ ఇంజిన్ న్యూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 113 బీహెచ్పీ విద్యుత్, 250 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది.
ఎక్స్ లైన్ వేరియంట్ మినహా కియా కరెన్స్ – 2024 అన్ని వేరియంట్లు పెవ్టర్ ఆలీవ్ కలర్ ఆప్షన్‌తో వస్తుంది. ఇదే కలర్ ఇంతకుముందు కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ఎస్యూవీ కార్లలో వినియోగించారు. కస్టమర్లు ఎయిట్ సింగిల్ టోన్, త్రీ డ్యుయల్ టోన్, సోల్ మ్యాట్టె గ్రే కలర్ ఆప్షన్లలో ఎక్స్-లైన్ ట్రిమ్ లభిస్తుంది.
కియా కరెన్స్ ఎక్స్ లైన్ వర్షన్ కారును గతేడాది అక్టోబర్ లో ఆవిష్కరించారు. ఇందులో డాష్ కామ్, వాయిస్ కమాండ్స్ టు కంట్రోల్ ఆల్ విండోస్, ఇంతకుముందు 6-సీట్స్ కాన్ఫిగరేషన్ కే పరిమితమైన ఎక్స్ లైన్ వేరియంట్ కారు ఇప్పుడు 7-సీట్లతో వస్తున్నది. కరెన్స్ ఎక్స్-లైన్ వేరియంట్లో 129 వాట్ల చార్జర్ బదులు 180 వాట్ల చార్జర్ వస్తుంది.