హైదరాబాద్, డిసెంబర్ 10: కియా ఇండి యా.. దేశీయ మార్కెట్‌కు నయా సెల్టోస్‌ను పరిచయం చేసింది. వచ్చే నెల చివరి నుంచి అందుబాటులోకి రానున్న ఈ కారుకోసం ముందస్తు బుకింగ్‌ను ఇప్పటికే ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ రిటైల్ అవుట్లెట్లలో ముందస్తుగా రూ.25 వేలు చెల్లించి బుకింగ్ చేసుకోవాల్సివుంటుందని, ఇలాంటివారికి జనవరి చివరి నుంచి డెలివరీ చేయనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో గ్వాంగు లీ తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ కారు ధర వచ్చే నెల 2న ప్రకటించనున్నట్టు తెలిపారు. ఈ కారులో ఆటోమేటిక్ స్ట్రీమ్‌లైన్ డోర్ హ్యాండిల్, ఐస్ క్యూబ్ ఎల్ఈడీ ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్స్, 30 ఇంచుల ఎల్ఈడీ డిస్ప్లే, భద్రతా ప్రమాణాలు మెరుగుపర్చడంలో భాగంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్స్ ఉన్నాయి.