న్యూఢిల్లీ, డిసెంబర్ 16: దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ కియా..దేశీయ మార్కెట్లోకి మరో మోడల్‌ను పరిచయం చేసింది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రానున్న ‘క్యారెన్స్’ మోడల్‌ను ఢిల్లీలో ప్రదర్శించింది. దేశీయ మార్కెట్లోకి విడుదల చేసిన నాలుగో మోడల్ ఇది కావడం విశేషం. ఇప్పటికే సెల్టోస్, సొనెట్, కార్నివాల్లను విక్రయిస్తున్నది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ కలిగిన ఈ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తోపాటు పలు ఫీచర్స్ ఉన్నాయి. మరోవైపు, వచ్చే రెండేండ్లలో దేశీయ మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది.