న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : కీలక రంగాలు మళ్లీ నెమ్మదించాయి. క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ రంగాల్లో నెలకొన్న నిస్తేజం కారణంగా గత నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 1.8 శాతానికి పరిమితమైంది. క్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 5.8 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా పడిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి.
కానీ, అక్టోబర్ నెలలో నమోదైన వృద్ధితో పోలిస్తే మాత్రం మెరుగైన వృద్ధిని కనబరిచాయి. ఈ ఏడాది అక్టోబర్ నెలలో మైనస్ 0.1 శాతానికి పడిపోయాయి. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్యకాలంలో కీలక రంగాల్లో వృద్ధి సగానికి సగం 2.4 శాతానికి పడిపోయాయి. అంతక్రితం ఏడాది ఇది 4.4 శాతంగా నమోదైంది.