పాలకుర్తి, మార్చి 1: ఆదిత్యా బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్‌లో బీకే బిర్లా గ్రూపునకు చెందిన కేశోరాం సిమెంట్ విలీనమయ్యాయి. ఇందుకు సంబంధించి పెద్దపల్లి జిల్లాలోని పాలకుర్తి మండలం బసంత్‌నగర్ వద్ద ఉన్న యూనిట్లో ఇందుకు సంబంధించి అధికారిక కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50 ఏండ్ల క్రితం ఉత్తర తెలంగాణలోని బసంత్‌నగర్‌లో బీకే బిర్లా సిమెంట్ ప్లాంట్‌ను నెలకొల్పారు. ఆతర్వాతి క్రమంలో ఇక్కడే కేశోరాం సిమెంట్‌ను ఉత్పత్తి చేశారు. ప్రస్తుతం ఈ కేశోరాం సిమెంట్‌ను ఆదిత్యా బిర్లా గ్రూపు కొనుగోలు చేయడంతో ఇకనుంచి ఈ ప్లాంట్‌లో అల్ట్రాటెక్ సిమెంట్‌ను ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి శనివారం ఈ యూనిట్లో కార్మికులు, గుర్తింపు కార్మిక సంఘం నాయకులు, ఉద్యోగులతో సమావేశం ఏర్పాటుచేసి, అధికారికంగా అల్ట్రాటెక్ లోగోను ఆవిష్కరించారు.