పాలకుర్తి, మే 3: నిర్మాణ అవసరాలకు అనుగుణంగా నూతన సాంకేతికతో రూపొందించిన కేశోరాం సూపర్ ప్లాస్ట్ సిమెంట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది కేశోరాం ఇండస్ట్రీస్. పర్యావరణానికి హాని కలుగకుండా, వినియోగదారులకు తక్కువ ఖర్చుతో ఉత్తమ నాణ్యతా ప్రమాణాలతో సూపర్ప్లాస్ట్ సిమెంట్‌ను అందిస్తున్నట్లు కంపెనీ సీఈవో అభయ్‌కుమార్ దిదీచ్ తెలిపారు. ఇటుక కట్టడాలకు, గోడల ప్లాస్టరింగ్ కోసం ఈ సిమెంట్ ఎంతో మేలు చేస్తున్నదని, అన్నిరకాల నిర్మాణాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. తొలి ఉత్పత్తిని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని డీలర్లకు అందజేస్తున్నట్లు ప్రకటించారు.