Kawasaki Z650RS | ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కవాసాకీ (Kawasaki India) భారత్ మార్కెట్లోకి అప్ డేటెడ్ వర్షన్ కవాసాకి జడ్650ఆర్ఎస్ మోటారు సైకిల్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్) గా నిర్ణయించింది. ఈ మిడిల్ వైట్ మోటారు సైకిల్ మోడర్న్, క్లాసిక్ ఎలిమెంట్స్‌తో కలిసి వస్తున్నది.
కవాసాకీ జడ్650ఆర్ఎస్ మోటారు సైకిల్ 2-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కలిగి ఉంటుంది. బురద రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు బైక్ జారిపోకుండా ఈ సిస్టమ్ నివారిస్తుంది. బైనెల్లి లియోన్సినో 500, హోండా సీఎల్500 స్క్రాంబ్లర్, ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్, డుకాటీ స్క్రాంబ్లర్ 800 మోటారు సైకిళ్లతో కవాసాకీ జడ్650 ఆర్ఎస్ మోటారు సైకిల్ పోటీ పడుతుంది.
ట్యూబులర్ డైమండ్ ఫ్రేమ్‌తో రూపుదిద్దుకున్న కవాసాకీ జడ్650ఆర్ఎస్ మోటార్ సైకిల్ రౌండ్ హెడ్ ల్యాంప్స్, సింగిల్ పీస్ సీట్, సెమీ అనలాగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కలిగి ఉంటుంది. భారత్ మార్కెట్లో సింగిల్ కలర్ – మెటాలిక్ మ్యాట్టె కార్బన్ గ్రే రంగులో లభిస్తుంది. కంఫర్టబుల్ రైడింగ్ కోసం టెలిస్కోపిక్ ఫోర్క్స్ జత చేస్తారు. వీటి వల్ల 125ఎంఎం వరకూ ప్రయాణించవచ్చు. రేర్ లో మోనోసాక్ అబ్జార్బర్ వల్ల 130 ఎంఎం వరకూ వెళ్లొచ్చు. ఫ్రంట్‌లో 272 ఎంఎం డ్యుయల్ డిస్క్ బ్రేక్, రేర్‌లో 186 ఎంఎం సింగిల్ డిస్క్ బ్రేక్ ఉంటాయి. 17-అంగుళాల గోల్డెన్ అల్లాయ్ వీల్స్‌తో ఈ బైక్ నడుస్తుంది.
కవాసాకి జడ్650ఆర్ఎస్ మోటారు సైకిల్ ఇంజిన్ 649సీసీ లిక్విడ్ కూల్డ్, పారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 8000 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 67 బీహెచ్పీ, 6700 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 64ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 6-స్పీడ్ డ్యూటీ గేర్ బాక్స్, అసిస్ట్ అండ్ స్లిప్ క్లచ్ కలిగి ఉంటుంది. నింజా 650, వెర్సస్ 650 మోటారు సైకిళ్లలోనూ ఇదే ఇంజిన్ అమర్చారు.