హైదరాబాద్, అక్టోబర్ 27: ప్రముఖ విత్తనాల ఉత్పత్తి సంస్థ కావేరీ సీడ్స్..రూ.125.6 కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయబోతున్నట్లు ప్రకటించింది. గురువారం సమావేశమైన కంపెనీ బోర్డు ఈ ప్రతిపాదనకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ప్రతి షేరుకు రూ.700 కంటే ఎక్కువ లేకుండా తక్కువకు కొనుగోలు చేయబోతున్నది. మార్కెట్ ముగిసిన సమయానికి కంపెనీ షేరు రూ.483 వద్ద ముగిసింది. మొత్తం పెయిడ్-అప్ క్యాపిటల్లో 9.85 శాతానికి సమానమైన షేర్లను బైబ్యాక్ చేయబోతున్నది.