‘ప్రేక్షకుల స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. విజయశాంతిగారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. తల్లీకొడుకుల బాండింగ్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్‌ని ప్రేక్షకులు పొగుడుతున్నారు. ముఖ్యంగా ైక్లెమాక్స్ ఈ సినిమాకు హైలైట్. మా అబ్బాయి సినిమా చూసి ఇలాంటి సీక్వెన్స్ ఇండియన్ స్క్రీన్‌పై చూడలేదన్నాడు. ఆ రియాక్షన్‌కి నేను షాక్ అయ్యాను. ఏదేమైనా ఈ క్రెడిట్ అంతా దర్శకుడు ప్రదీప్‌దే’ అని హీరో కల్యాణ్‌రామ్ పేర్కొన్నారు.
ఆయన హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. విజయశాంతి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ ప్రెస్మీట్లో కల్యాణ్‌రామ్ మాట్లాడారు. ‘నిర్మాణంలో ఉన్నప్పుడే ఈ సినిమా సూపర్‌హిట్ అవుతుందని నమ్మాం. ఆ నమ్మకం నిజమైంది’ అని నటుడు శ్రీకాంత్ అన్నారు. ప్రేక్షకులకూ, ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ దర్శక, నిర్మాతలు కృతజ్ఞతలు తెలియజేశారు.