హైదరాబాద్, జూలై 13: తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయనున్నట్లు అసోచామ్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ చైర్మన్ కే రవి కుమార్ రెడ్డి తెలిపారు.
నూతన కమిటీ సమావేశమై..ఇరు ప్రభుత్వాలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు, వృద్ధిని మరింత పరుగులు పెట్టించడానికి ఒప్పందాలు కూడా కుదుర్చుకోనున్నట్లు చెప్పారు. స్థిరత్వం, సాధికారత, వ్యవస్థాపకత, డిజిటలైజేషన్ వంటి విభాగాల్లో దూసుకుపోతున్నాయన్నారు.