హైదరాబాద్, సెప్టెంబర్ 12 : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా.. మార్కెట్లోకి సరికొత్త హెక్టార్ కారును తీసుకొచ్చింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దేశీయంగా తొలి మల్టీ-న్యూ ఎనర్జీ వెహికల్ ప్లాట్ఫామ్లో విడుదలైన తొలి వాహనం ఇదే కావడం విశేషం. ఈ కారు బ్యాటరీ-ఏస్-ఏ-సర్వీసెస్(బాస్) ప్రారంభ ధర రూ.13.99 లక్షలు+ కిలోమీటర్‌కు రూ.4.90 బ్యాటరీ రెంటల్, మరో మాడల్ రూ.21.79 లక్షలు+కిలోమీటర్‌కు బ్యాటరీ రెంటల్ రూ.3.20 చొప్పున వసూలు చేయనున్నది.
69.2 కిలోవాట్ల మ్యాజిక్ బ్యాటరీతో తయారైన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో 517 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది. ఈ కారు బ్యాటరీపై లైఫ్‌టైం వ్యారెంటీని ఇస్తున్నది. 15.6 ఇంచుల హెచ్డీ డిస్ప్లే, లెవల్ 2 అడాస్, ఐ-స్మార్ట్ 3.0, 80కి పైగా నూతన ఫీచర్లు, జెన్ ఏఐ పవర్ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది. ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారు కేవలం 9 సెకండ్లలో 100 కిలోమీటర్లు వేగాన్ని అందుకోనున్నదని కంపెనీ వర్గాలు తెలిపాయి.