హైదరాబాద్, జనవరి 7: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్.. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో ఎంత బరువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేసిన వారికి అంతే బరువైన వెండిని బహుమతిగా అందచేస్తున్నది. దీంతోపాటు రూ.50 వేలకు పైగా డైమండ్లను కొనుగోలు చేసిన వారికి వెయ్యి రూపాయల విలువైన ప్రత్యేక వోచర్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు జోయాలుక్కాస్ గ్రూపు ఎండీ జాయ్ అలూక్కాస్ తెలిపారు. ఈ పండుగ సీజన్లో కస్టమర్లకు సరికొత్త షాపింగ్ అనుభవం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్లు చెప్పారు. ఈ నెల 15 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.