హైదరాబాద్, మే 15: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోయాలుక్కాస్..అంతర్జాతీయ వ్యాపార విస్తరణలో భాగంగా అమెరికాలో ఐదు షోరూంలను ప్రారంభించబోతున్నది. వీటిలో డల్లాస్, అట్లాంటాలో కొత్త షోరూంలను ప్రారంభించనుండగా, మిగతా మూడు ఆధునీకరించింది. ఈ నెల 18న హ్యూస్టన్, 26న డల్లాస్లో, జూన్ 2న అట్లాంట్లో, జూన్ 9న షికాగో, జూన్ 15న న్యూజెర్సీలో తమ అవుట్లెట్లను తెరవబోతున్నట్లు జోయాలుక్సా గ్రూపు చైర్మన్ జాయ్ అలూక్కాస్ తెలిపారు.
ఈ సందర్భంగా అక్కడి కస్టమర్లకు వెయ్యి డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ చేసే బంగారు ఆభరణాలపై 0.2 గ్రాముల గోల్డ్ కాయిన్, 2 వేల డాలర్ల కంటే డైమండ్, పోల్కి జ్యూవెల్లరీ కొనుగోలు చేసిన వారికి ఒక్క గ్రామ్ గోల్డ్ కాయిన్ను అందిస్తున్నది.