హైదరాబాద్, డిసెంబర్ 21: ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్..ప్రవాస భారతీయులకోసం ప్రత్యేకంగా గోల్డ్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నది. ఈ పండుగ సీజన్లో ఆభరణాలు కొనుగోలుచేసే ఎన్ఆర్ఐలు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది.
పాత గోల్డ్‌పై ప్రతిగ్రాముకు రూ.50 అదనంగా చెల్లిస్తున్న సంస్థ, డైమండ్స్, అన్‌కట్ డైమండ్స్, ప్రెషస్ స్టోన్స్ కోసం మజూరీ చార్జీలను, స్టోన్ విలువపై 25 శాతం తగ్గింపు ధరతో అందిస్తున్నది. ఈ ప్రత్యేక ఆఫర్లు వచ్చే నెల 5 వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆభరణాల విక్రయశాలలో అందుబాటులో ఉంటుందని పేర్కొంది.