హైదరాబాద్, డిసెంబర్ 21: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్..మరోసారి డైమండ్ ఫెస్ట్‌ను ప్రారంభించింది. వజ్రాల కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి సంస్థ ప్రత్యేకంగా ఆఫర్లను తీసుకొచ్చింది. ఈ ఫెస్ట్‌లో భాగంగా క్యారెట్ వజ్రాన్ని కొనుగోలు చేసిన వారికి 500 మిల్లీగ్రాముల బంగారు నాణేన్ని ఉచితంగా అందిస్తున్నది. దీంతోపాటు వజ్రాల ఆభరణాలపై ప్రతి క్యారెట్‌కు రూ.15 వేల తగ్గింపు ధరతో విక్రయిస్తున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
అలాగే వినియోగదారుల వద్ద ఉన్న పాత బంగారాన్ని అంతర్జాతీయ ప్రయోగశాలల్లో ధృవీకరించిన వజ్రాలతో ఎక్సేంజ్ చేసుకోవడానికి, అధిక లాభాలను పొందడానికి ఈ ఫెస్ట్ సరైనదని కంపెనీ చైర్మన్ జోస్ ఆలుక్కాస్ తెలిపారు. ఈ వేడుకలో భాగంగా నిర్వహించనున్న లక్కీ డ్రాలో గెలుపొందిన ఏడు జంటలను గోవా తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.