JioBharat Diwali Dhamaka | రిలయన్స్ అనుబంధ జియో.. దీపావళి సందర్భంగా తన ఫీచర్ ఫోన్లపై ధరలు తగ్గించింది. ‘జియో భారత్ దీపావళి దమాకా’ పేరుతో 4జీ కనెక్టివిటీ ‘జియో భారత్ 4జీ’ ఫోన్ రూ.999 నుంచి రూ.699లకే అందజేస్తుంది. ఈ ఆఫర్ కింద జియో 2జీ ఫోన్ వాడకం దారులు తమ ఫోన్ ను జియో భారత్ 4జీ తో అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. దేశంలోని ఫీచర్ ఫోన్లలో అతి తక్కువ ధరకు జియో ఫీచర్ ఫోన్లు లభిస్తాయి. జియో భారత్ కే1, జియో భారత్ వీ2 ఫోన్లు రూ.999కి బదులు రూ.699లకే కొనుగోలు చేయొచ్చు. ఈ రెండు ఫోన్లపై రూ.300 డిస్కౌంట్ నవంబర్ మూడో తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది.
ఇక ఇతర టెలికం కంపెనీల నెలవారీ రీచార్జీ ప్లాన్లతో పోలిస్తే జియో భారత్ ఫీచర్ ఫోన్ ప్లానతో ప్రతి నెలా 40శాతం. అంటే రూ.76 పొదుపు చేయొచ్చునని రిలయన్స్ జియో తెలిపింది. రిలయన్స్ జియో సిమ్ కార్డుతో మాత్రమే పని చేసే ఈ ఫోన్లు యూజర్లు తమకు సమీపంలోని రిలయన్స్ స్టోర్లలో గానీ, జియో మార్ట్ లేదా అమెజాన్ వెబ్ సైట్ ద్వారా గాని కొనుగోలు చేయొచ్చునని తెలిపింది.