Jio | జియో యూ-టర్న్.. రూపాయి ప్లాన్ వ్యాలిడిటీ ఉల్టా!
Jio | రూపాయి ప్రీపెయిడ్ ప్లాన్‌పై జియో రూట్ మార్చింది. దాన్ని ఒక్కరోజుకు, 100 ఎంబీ నుంచి 10ఎండీ డేటాకు పరిమితం చేసింది.

Jio | తాజాగా ప్రకటించిన ప్లాన్‌పై రిలయన్స్ జియో 24 గంటల్లోనే యూ-టర్న్ తీసుకున్నది. కేవలం రూపాయికే 30 రోజులపాటు 100ఎంబీ డేటా ఇస్తామని బుధవారం ప్రకటించింది. కానీ గురువారం జియో మాట మార్చింది. రూపాయి రీ చార్జి ప్లాన్ ఒక్కరోజుకు మాత్రమేనని అదీకూడా కేవలం 10ఎంబీ డేటా మాత్రమే పొందొచ్చని తెలిపింది. బుధవారం చేసిన ప్రకటన ప్రకారం రూపాయిపై 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉండటంతోపాటు 100 ఎంబీ డేటా పొందొచ్చు.
కానీ సవరణ ప్రకారం ఆ ప్లాన్‌కు ఒక్కరోజుకు.. డేటా ప్లాన్‌ను భారీగా తగ్గించేసింది. తాజాగా ప్రకటించిన ప్లాన్‌నూ ఇతర ప్లాన్లతోపాటు ప్యాక్ వాల్యూ సెషన్లో లిస్ట్ చేసింది. ఈ మేరకు పాత ప్రకటనపైనా, తాజా ప్రకటనసైనా స్క్రీన్షాట్లను జియో షేర్ చేసుకుంది. రిలయన్స్ జియో తీసుకున్న ఈ నిర్ణయం యూజర్లను ఆశ్చర్యచకితులని చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో 100 ఎంబీ డేటా పొందాలంటే 10 సార్లు రీచార్జీ చేయాల్సి ఉంటుంది. దీని వ్యాలిడిటీ కేవలం 10 రోజులే ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

