న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో దూసుకుపోతున్నది. 5జీ డౌన్‌లోడ్‌లో అగ్రస్థానంలో నిలిచినట్టు ఓక్లా స్పీడ్‌టెస్ట్ ఇంటెలిజెన్స్ డాటాలో వెల్లడించింది. గతేడాది జూలై-డిసెంబర్ మధ్యకాలంలో సెకన్‌కు 258.54 మెగాబైట్ల డాటా డౌన్లోడ్ అయిందని తెలిపింది.
తన పోటీ సంస్థ ఎయిర్టెల్ డౌన్లోడ్ 205.1 ఎంబీపీఎస్‌తో రెండో స్థానంలో నిలిచినట్టు పేర్కొంది.