Jio plus Disney Hotstar | టెలికం దిగ్గజం రిలయన్స్ జియో తన ఖాతాదారుల కోసం కొత్త ప్లాన్ అమల్లోకి తెచ్చింది. 28 రోజుల గడువు గల ఈ ప్రాన్‌ను రూ.499కే అందించనున్నది. ఈ ప్లాన్ కింద రోజూ రెండు జీబీల హైస్పీడ్ డేటా చొప్పున మొత్తం 56జీబీ డేటా పొందొచ్చు. డేటా పరిమితి తగ్గాక నెట్ వేగం 64కేబీపీఎస్‌లకు పడిపోతుంది. అపరిమిత వాయిస్ కాలింగ్‌తోపాటు ప్రతి రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా పంపొచ్చు. రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తాయి.
ఈ ప్లాన్ కింద కొత్త కస్టమర్లు వివిధ రకాల జియో యాప్స్ వినియోగించుకోవచ్చు. ఏడాది గడువు గల డిస్నీ + హాట్‌స్టార్ మొబైల్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ప్రయోజనాలూ పొందవచ్చు. గతేడాది ఆగస్టులో జియో తొలుత ఈ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. గత నెలలో దీని ధర రూ.601కి పెంచినా.. తాజాగా రూ.499కి తగ్గించింది.