న్యూఢిల్లీ, జనవరి 23: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లకోసం కొత్తగా వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. టెలికం నియంత్రణ మండలి ట్రాయ్ సూచనల మేరకు డాటా అవసరంలేని కస్టమర్లకోసం తప్పనిసరిగా వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్లతో కూడిన ప్లాన్లను ప్రవేశపెట్టాలనే సూచనలకు అనుగుణంగా జియో ఈ నూతన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
84 రోజుల కాలపరిమితితో రూ.458 ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌కింద అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, వెయ్యి ఎస్ఎంఎస్లు, రూ. 1,958 ప్లాన్ కింద అన్లిమిటెడ్ వాయిస్‌కాల్స్‌తోపాటు 3,600 ఎస్ఎంఎస్లు 365 రోజుల ప్యాక్‌ను అందిస్తున్నది.