న్యూఢిల్లీ, ఆగస్టు 31: రిలయన్స్ జియో.. సరికొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్లను మంగళవారం పరిచయం చేసింది. డిస్నీప్లస్ హాట్స్టార్పై అన్ని కంటెంట్లకు అపరిమిత అనుమతితో వచ్చిన ఈ బండిల్డ్ ప్లాన్ల ప్రారంభ ధర రూ.499గా ఉన్నది. అంతర్జాతీయ కంటెంట్ న్యూ లైబ్రరీసహా డిస్నీప్లస్ ఒరిజినల్స్, డిస్నీ, మార్వెల్, స్టార్ వార్స్, నేషనల్ జియోగ్రాఫిక్, హెచ్బీవో, ఎఫ్ఎక్స్, షోటైం తదితర టీవీ షోలన్నింటికీ అనుమతి ఉంటుంది. డిస్నీప్లస్ హాట్స్టార్ ఏడాది సబ్స్క్రిప్షన్కుతోడు అన్లిమిటెడ్ వాయిస్, డాటా, ఎస్ఎంఎస్, జియో యాప్స్ ఇతర ప్రయోజనాలూ కస్టమర్లు పొందవచ్చు. బుధవారం నుంచి కొత్త ప్లాన్లు అందుబాటులో ఉంటాయి.