న్యూఢిల్లీ, మార్చి 27: ఫిక్స్డ్ బ్రాడ్‌బాండ్ సేవల వ్యాపారంలో జియో దూకుడు పెంచింది. ప్రారంభ స్థాయిలో రూ.198 నెలసరి ప్లాన్‌ను సోమవారం అందుబాటులోకి తెచ్చింది. బ్రాడ్‌బాండ్ బ్యాక్-అప్ ప్లాన్ పేరుతో ఈ సరికొత్త ఆఫర్‌ను పరిచయం చేయగా, ఇందులో వినియోగదారులకు గరిష్ఠంగా సెకనుకు 10 మెగాబైట్ (ఎంబీపీఎస్) వేగం లభిస్తుంది.
రూ.21 నుంచి రూ.152 మధ్య చేసే చెల్లింపులనుబట్టి ఒకరోజు నుంచి వారం రోజులదాకా ఇంటర్నెట్ స్పీడ్‌ను 30 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు పెంచుకునే సౌకర్యాన్ని కూడా కస్టమర్లకు జియో ఇచ్చింది. ఇక కొత్త కస్టమర్లు రూ.1,490 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 5 నెలల సర్వీసు, ఇన్స్టాల్లేషన్ చార్జీలుంటాయి. ఇటీవల ఎయిర్టెల్ సైతం ప్రీ-పెయిడ్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ ఫోన్ టారీఫ్ల్లో మార్పులు చేసినది తెలిసిందే.