న్యూఢిల్లీ, డిసెంబర్ 15: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో నూతన సంవత్సరం సందర్భంగా పలు ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2026 నూతన సంవత్సరం సందర్భంగా వార్షిక, నెల, డాటా, ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఆఫర్లు వీటిలో ఉన్నాయి. రూ.3,599తో రీచార్జి చేసుకుంటే 365 రోజులపాటు టెలికాం సేవలు పొందవచ్చునని, అలాగే రోజుకు 2.5 జీబీ డాటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు.
వీటితోపాటు 18 నెలలపాటు గూగుల్ జెమినీ ప్రొను ఉచితంగా పొందవచ్చును. అలాగే 28 రోజుల కాలపరిమితి కలిగిన రూ.500 సూపర్ సెలబ్రేషన్ మంత్లీ ప్లాన్ కూడా ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 2జీబీ డాటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చును. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లు జియో అధికారిక వెబ్సైట్, మైజియో యాప్, రిటైల్ అవుట్లెట్ల వద్ద కూడా లభించనున్నాయి.